Sunday, April 28, 2024

ఏపిల్‌ 30న కంటోన్మెంట్ ఎన్నిక‌లు .. మ‌రోసారి స‌చివాల‌యం ప్రారంభోత్స‌వం వాయిదా?

హైదరాబాద్‌ ,ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహబ్‌ అంబేద్కర్‌ పేరుతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కొత్త సచివాలయ భవన ప్రారంభోత్సవం కార్యక్రమం మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తు న్నాయి.అత్యంత ప్రతిష్ఠాత్మంగా, అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు పుట్టిన రోజున ప్రారంభించాలని,అదే రోజున సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో భారీ బహరంగ సభను నిర్వహంచాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు తమిళనాడు,జార్ఖండ్‌ ముఖ్య మంత్రులు స్టాలిన్‌, హమంత్‌ సొరేన్‌ తో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల ముఖ్య నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానించారు. అదే రోజు ప్రగతి భవన్‌లో ఆహ్వానించిన అతిధులకు విందు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయి రాజకీయాలు, భారత రాష్ట్ర సమితి భవిష్యత్‌ ప్రణాళికపై చర్చించాలని భావించారు.

ఈ భేటీ ముగిసాక భారత రాష్ట్ర సమితి(భారాస) బహరంగ సభలో నేతలంతా పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు. ఖమ్మంలో నిర్వహంచిన తొలి భారాస బ#హరంగసభ విజయ వంతం కావడం నాందేడ్‌లో జరిగిన రెండో సభకు ఊహంచని రీతిలో ప్రజలు పాల్గొనడంతో తర్వాత సభను రాష్ట్ర రాజధాని హద రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో జరపాలని కేసీఆర్‌ నిర్ణయించి అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని పార్టీ యంత్రాగాన్ని ఆదేశించారు ఖమ్మం లో నిర్వహంచిన సభ తలదన్నేలా ఏర్పాట్లు చేయడంతో పాటు జన సమీకరణపై దృష్టి పెట్టాలని, ఈ సభ ద్వారా సత్తా చాటాలని కేసీఆర్‌ నిర్ణయించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి(ఎన్నికల కోడ్‌) అమల్లోకి రావడంతో 17న నిర్వహంచాలన్న సచివాలయ భవన ప్రారంభోత్సవానికి, బహరంగ సభకు బ్రేక్‌ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున సచివాలయ భవన ప్రారంభానికి అనుమతులివ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అయినా అక్కడి నుంచి ప్రత్యుత్తరం రాకపోడంతో ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్‌ జయంతి రోజున (ఏప్రిల్‌ 14)న సచివాలయ నూతన భవనంతో సహా సచివాలయం వెనక భాగాన భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎదురుగా నిర్మించిన అమరవీరుల స్మారక స్థూపాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం తలంచింది.

అదే రోజున భారీ బహరంగ సభ నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసే పనుల్లో భారాస యంత్రాంగం నిమగ్నమైవుంది. ఈ లోగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికలకు రక్షణ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేయడంతో పాటు షెడ్యూల్‌ ను ప్రకటించింది. ఏపిల్‌ 30న కంటోన్మెంట్‌ బోర్డుకు ఎన్నికలు జరిపేందుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. తాజాగా ఈ నోటిఫికేషన్‌ వెలువడడంతో ఆ ప్రభావం భారాస బహరంగసభపై పడుతుందని చెబుతున్నారు. బహరంగ సభ జరిపే పరేడ్‌ మైదానం కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోకి రావడంతో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వక పోవొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే బహరంగ సభ జరపడం కుదరదన్న భావనతో పార్టీ ఉన్నట్టు సమాచారం. ఒక వేళ వచ్చే నెల 14న అంబేద్కర్‌ జయంతి రోజునే సచి వాలయ భవన ప్రారంభంతో పాటు అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరణ,అమర వీరుల స్థూపాన్ని ప్రారంబించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తే బహరంగ సభను సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో కాకుండా నిజాం కళాశాల ఆవరణలోనైనా లేక కొంగరకలాన్‌లో 2018 ఎన్నికలకు ముందు ప్రగతి నివేదన పేరుతో నిర్వహంచిన ప్రాంతంలోనైనా సభ నిర్వహించే ఆలోచనతో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement