Saturday, April 27, 2024

Lord Ram | రాహుల్​ గాంధీ రాముడిలా కనిపిస్తున్నాడు.. సీనియర్​ నేత సల్మాన్​ ఖుర్షిద్​ కామెంట్స్​

కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత సల్మాన్​ ఖుర్షిద్​ రాహుల్​ గాంధీని రాముడితో కంపేర్​ చేశారు. రాముడి ‘ఖదౌ’ చాలా దూరం వెళుతుంది. కొన్నిసార్లు భరత్ ‘ఖదౌ’ పట్టుకుని రామ్ జీ చేయలేని ప్రదేశాలకు వెళ్తాడు. భారత్ లాగానే యూపీలో ‘ఖదౌ’ని మోశాం. ఇప్పుడు ‘ఖదౌ’ యూపీకి చేరుకుంది, రామ్ జీ (రాహుల్ గాంధీ) కూడా వస్తాడు,” అని కుర్షిద్​ పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

రాహుల్ గాంధీ “ఒక యోగిలాగా తన తపస్సు చేస్తున్నాడు” అని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. భారత్ జోడో యాత్ర ప్రారంభంలో అనుకున్నట్టు కాకుండా.. తన రూట్​ మ్యాప్​లో లేని ఉత్తర ప్రదేశ్​కు యాత్ర మారిందని తెలిపారు. ఇక.. రాహుల్ గాంధీ మానవాతీతుడని, తాము చలిలో గడ్డ కట్టి, జాకెట్లు వేసుకుని ఉంటే.. అతను టీ-షర్టుతో (భారత్ జోడో యాత్ర కోసం) బయటకు వెళ్తున్నాడన్నారు. ఓ యోగిలాగా తన ‘తపస్సు’ను ఏకాగ్రతతో చేస్తున్నాడని ఖుర్షీద్ అన్నారు.

అయితే.. బీజేపీకి చెందిన షెహజాద్ పూనావాలా ట్విటర్‌లో ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యను “హిందూ అస్తాను అవమానించడమే” అని పేర్కొన్నారు. సల్మాన్ ఖుర్షీద్ రాహుల్ గాంధీని భగవాన్ శ్రీరాముడితో సమానం, తనను భారత్‌తో సమానం!! షాకింగ్! అతను ఎవరినైనా ఇతర మతాల దేవుడితో పోల్చే ధైర్యం చేస్తాడా? రామ్ జీ ఉనికిని నిరాకరించిన తర్వాత, ఇప్పుడు రామమందిరాన్ని అడ్డుకోవడం హిందూ అస్తాను అవమానించడమే! జానేధరి రాహుల్ అంగీకరిస్తారా? అని పూనావలా ట్విట్టర్​లో పేర్కొన్నారు. కాగా, తమిళనాడు నుండి జమ్మూ కాశ్మీర్ వరకు కాంగ్రెస్ భారీ ప్రచార కార్యక్రమానికి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్న – భారత్ జోడో యాత్ర ఢిల్లీకి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement