Sunday, April 28, 2024

హుజురాబాద్ లో కాంగ్రెస్ ఓటమికి కారణమేంటి?

హుజురాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చినట్లు కనిపిస్తోంది. హుజూరాబాద్ బై పోల్ లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఆ పార్టీ నేతలను తీవ్ర నిరాశకు గురి చేశాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 61 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ..  తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం 3,014 ఓట్లకే పరిమితం అయింది. డిపాజిట్లను కూడా రాబట్టుకోలేకపోయింది. దీంతో పార్టీ ఘోర ఓటమిని హస్తం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. కొత్త అధ్యక్షుడు వచ్చినా.. పార్టీ బలోపేతం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటమిపై ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పొన్నం వంటి నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలో ఘోర పరాజయంపై కాంగ్రెస్ నేతలు బుధవారం కీలక భేటీ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఓటమిపై చర్చించనుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ తో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు ఈ కీలక సమావేశానికి హాజరుకానున్నారు.

వాస్తవానికి హుజురాబాద్ లోని జరిగిన ఉపఎన్నిక కేవలం టీఆర్ఎస్ వర్సెస్ ఈటలగానే చూడాలని విశ్లేషకులు అంటున్నారు. స్థానిక ప్రజలు పార్టీల కంటే ఈటలను చూసే ఓట్లు వేశారని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, గత ఎన్నికల్లో సెకండ్ ప్లేస్ లో నిలిచిన కాంగ్రెస్ కు .. ఈసారి డిపాజిట్ కూడా దక్కకపోవడం ఆపార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. గెలుపు సంగతి పక్కన బెడిన కనీసం గత ఎన్నికల్లో వచ్చిన 60 వేల ఓట్లు అయినా పదిలంగా లేవని ఆవేదనతో ఉన్నారు. ఈ పరిణామల నేపథ్యంలో నాయకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: Huzurabad: కాంగ్రెస్‌, బీజేపీ భారీ డీల్.. రేవంత్ పై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణ

Advertisement

తాజా వార్తలు

Advertisement