Saturday, May 4, 2024

బీఆర్ఎస్ తో క‌ల‌వాల‌ని చూస్తోన్న కాంగ్రెస్ .. బండి సంజ‌య్

బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ క‌ల‌వాల‌ని చూస్తోంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయిందన్నారు. ఏ పార్టీ అయినా గెలుస్తామని చెబుతుందని, కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ఓడిపోతామని చెబుతున్నారన్నారు. మోడీ నిజాయితీని చూసి ప్రజలు బీజేపీకి ఓటేస్తారని రాష్ట్రంలోని 119 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి తప్పదని తెలిసి కూడా ఆ పార్టీ నేతలు యాత్రలు ఎందుకు చేస్తున్నారని బండి చురకలంటించారు. ఎన్నికలకు ముందు వేర్వేరుగా పోటీ చేసి ఆ తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement