Monday, October 14, 2024

ఇసుక దందాపై ఇవిగో రుజువులు..

అనంతపురం, ప్రభ న్యూస్‌ బ్యూరో: పెన్నా నదిలో ఇసుక అక్రమ దందా వ్యవహారంపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. అనంతపురంలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహిం చారు. ఇసుక రీచులు మొదలు తవ్వకాల వరకు నిబంధనలు, అధికారుల బాధ్య తలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్ర మాలను వివరించారు. ఈ వ్యవహారంపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన ఆయన వాస్తవ ఘటనలపై మీడియాకు అవగాహన కల్పించారు. 40 నిముషా లపాటు ఆయన ప్రొఫెసర్‌గా , మీడియా సిబ్బంది విద్యార్థులుగా మారారు.

పెద్దపప్పూరు సమీపంలోని పెన్నానదిలో ఇసుక అక్రమరవాణాను అడ్డుకుందాం రండి అంటూ ఎమ్మెల్యేకి పిలుపు ఇచ్చా రు. అక్కడ జరుగుతున్న ఇసుక దోపిడీ పై సాక్ష్యా ధారాలతో సహా వివరించారు. ఇసుక రీచ్‌ లో నిబంధనలు పాటించడం లేదని, రోజుకి 20 మందితో 75 ట్రాక్టర్లు లేదా15 టిప్పర్లు మాత్రమే తరలించాలన్న నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐదు జేసిబి యంత్రాలతో రాత్రింబవళ్ళు 200 టిప్పర్లు, 80 ట్రాక్టర్లు లోడింగ్‌ చేస్తున్నారని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో ఫొటో లు చూపించారు. పెద్ద ఎత్తున దోపి డీ జరుగుతుంటే మానిటరింగ్‌ కమిటీ- ఏం చేస్తోందని ప్రశ్నించారు. కలెక్టర్‌ సహా కమిటీ-లోని 13 మంది సభ్యులు ఏం చేస్తున్నారని నిలదీ శారు. ఆధారాలతో అక్రమాలు బయట పెట్టినా అధికారులు స్పం దించరా ఆవేదన వ్యక్తం చేశారు. పెన్నానదిలో వేస్టు మట్టిని వేసి పర్యావరణానికి హని కలిగి స్తున్నారని తెలిపారు. గ్రీన్‌ ట్రిబ్యు నల్‌లో కేసు దాఖలు చేస్తామని అన్నారు. ఇసుక అక్రమ రవాణా పై మూడు రోజుల్లో స్పందించకుంటే నా తో పాటు- మరో ఇద్దరం పెన్నానదిలో దూకేస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement