Friday, May 3, 2024

కాంగ్రెస్ కి గ‌ట్టి దెబ్బే – పార్టీని వీడిన కీల‌క నేత జ‌స్టీర్ సింగ్ ఖంగుర‌

పార్టీ అన్నాక వ‌ల‌స‌లు స‌ర్వ సాధార‌ణ‌మే. కానీ పార్టీ కీల‌క‌నేత‌లు పార్టీని వీడటం పెద్ద దెబ్బ‌నే చెప్పాలి. కాగా అసెంబ్లీ ఎన్నిక‌లకి ముందు పంజాబ్ కాంగ్రెస్ కి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, కీల‌క‌నేత జ‌స్టీర్ సింగ్ ఖంగుర ఆ పార్టీని వీడారు. త‌న రాజీనామా లేఖ‌ను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. చాలా సంవ‌త్స‌రాల నుంచి కాంగ్రెస్ బ‌లంగా నిలుస్తున్న ఆయ‌న జ‌స్పీర్ కుటుంబం కాంగ్రెస్ ని వీడ‌టం ఆ పార్టీకి పెద్ద బెబ్బ త‌గిలిన‌ట్టే అని చెప్పాలి. సోనియా గాంధీకి పంపిన లేఖ‌లో పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు జ‌స్బీర్ సింగ్ ఖంగుర వెల్ల‌డించారు.

అలాగే, పార్టీ కోసం త‌న తండ్రి 60 ఏండ్లు, తాను 20 సంవ‌త్స‌రాలు సేవ చేశామ‌ని గుర్తుచేశారు. కాంగ్రెస్ నుంచి ఇంత‌కాలం పాటు ప్ర‌జ‌ల‌కు సేవ చేసుకునే అవ‌కాశం క‌ల్పించినందుకు కృత‌జ్ఞ‌త‌లు అని పేర్కొన్న జ‌స్పీర్ సింగ్ ఖంగ‌ర.. రాజీనామాకు గ‌ల కార‌ణాన్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు. జ‌స్బీర్ సింగ్ ఖంగుర గ‌తంలో ఖిలా రాయ్‌పూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆయ‌నకు అసెంబ్లీ టికెట్ నిరాక‌రించింది. త‌న‌కు టిక్కెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతోనే ఆయ‌న రాజీనామా చేసిన‌ట్టు స‌మాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement