Monday, May 13, 2024

టీఆర్ఎస్ లో భగ్గుమన్న విభేదాలు.. క‌న్నీరుపెట్టుకున్న మున్సిపల్​ చైర్​పర్సన్​..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తనను అగౌరవ పరిచిన యూసుఫ్, మోరే భాస్కర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని విజయవాడ – జగ్ధల్ పూర్ జాతీయ రహదారిపై మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, టీఆర్ఎస్ మహిళా వార్డు కౌన్సిలర్స్ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో టీఆర్ ఎస్‌లో విభేదాలు పొడ‌చూపాయి. ఇవ్వాల కొత్తగూడంలో కేంద్రంలోని బీజేపీ తీరుపట్ల నిరసన తెలియ‌జేసిన క్ర‌మంలో ఈ పొర‌పొచ్చాలు బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది.

కాగా, టీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించే క్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతా మహాలక్ష్మితో కొంత‌మంది మహిళ కౌన్సిలర్ల భర్తలు ఆకతాయిల్లా వ్యవహరించిన‌ట్టు తెలుస్తోంది. ఆమెను వెనుక నుంచి బైకులతో ఢీకొట్టి చీర ఊడిపోయేలా చేశార‌ని, తనను అగౌరవపరిచారని ఏడుస్తూ పార్టీ శ్రేణులకు ఫిర్యాదు చేశారు మునిసిపల్ చైర్ పర్సన్. ‘‘బైక్ తో ఢీకొట్టే వారికి దండం పెడుతున్న.. కానీ తనతో ఆకతాయిల్లాగా వ్యవహరించారని కన్నీరుమున్నీరవుతూ గోడు వెల్లబోసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement