Tuesday, May 7, 2024

Show End: హాస్యనటుడి మృతి అనుమానాస్పదం..

అమెరికా హాస్య నటుడు బాబ్ సాగే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఫ్లోరిడాలోని ఒక హోటల్ గదిలో ఆయన మృతదేహం కనిపించింది. 65 ఏళ్లున్న బాబ్ సాగే గది నుండి బయటకు రాలేదు. అలాగే ఎలాంటి సమాచారం అందించ లేదు. దీంతో సిబ్బంది వెళ్లి చూడగా అప్పటికే ఆయన చనిపోయి ఉన్నారు.

ఎంతో మంది ముఖాల్లో నవ్వులు పూయించిన ఈ కమెడియన్ ఇలా అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోవడం ఆయన అభిమానులను, హాలీవుడ్ ను కలచి వేసింది. స్టాండప్ కామెడీతో పాటు టెలివిజన్ షోలను కూడా హోస్ట్ చేసిన ఆయన.. 2016లో ‘ఫుల్లర్ హౌస్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ లో ప్రారంభమైన షోతో మరింత పాపులర్ అయ్యారు. కాగా బాబ్ సాగే మృతికి చాలామంది సంతాపం తెలుపుతున్నారు. ‘‘ఒక శకం ముగిసింది’’ అని అందాల సుందరి ప్రయాంక చోప్రా బాబ్ సాగే మృతికి సంతాపం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement