Sunday, April 28, 2024

సీఎం యోగి తొలి సంత‌కంతో – ’15కోట్ల’ మందికి ల‌బ్ధి

రెండోసారి యూపీ సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు యోగి ఆదిత్య‌నాథ్. కాగా రెండోసారి సీఎం అయిన యోగి ఈరోజు తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. రెండో సారి సీఎం అయిన యోగి.. ఈ సమావేశంలో తొలి నిర్ణయం తీసుకున్నారు. ఉచిత రేషన్ బియ్యం పంపిణీ (ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన) పథకాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30వ తేదీ వరకు ఈ పథకాన్ని అమలు చేస్తామని యోగి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 15 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతారని అన్నారు. వాస్తవానికి ఈ పథకం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పథకాన్ని పొడిగిస్తూ యోగి సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement