Thursday, December 7, 2023

CM Tour | రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీని ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్‌.. ఎల్లుండి శంక‌ర్‌ప‌ల్లిలో ప‌ర్య‌ట‌న‌

శంకర్‌పల్లి, (ప్రభ న్యూస్): రంగారెడ్డి జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ ప్రారంభం కానుంది. శంక‌ర్‌ప‌ల్లి మండ‌లం కొండ‌క‌ల్ గ్రామంలో నిర్మించిన ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీని సీఎం కేసీఆర్ ఎల్లుండి (22న గురువారం) ప్రారంభించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న శంక‌ర్‌ప‌ల్లి మండ‌లంలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం మండల పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి, ల‌బ్ధిదారుల‌కు ఇంటి తాళాలు ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఆ త‌ర్వాత పటాన్ చెరులోని ప్రభుత్వ సూపర్​ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక.. ఆయా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమ‌గ్న‌మైంది. పోలీస్ క‌మిష‌న‌ర్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు సీఎం ప‌ర్య‌టించే అన్ని ప్రదేశాలను పరిశీలించారు. ఆయా ప్ర‌దేశాల్లో ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు చేప‌ట్టారు. త‌గు ఏర్ప‌ట్ల‌పై సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement