Sunday, April 28, 2024

ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ పరిస్థితులు, సంబంధిత అంశాలు, తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. సంస్థకు వస్తున్న ఆదాయంతో పాటు ఖర్చు, అప్పుల వివరాలపై సమావేశంలో చర్చించారు. అర్టీసీకి ప్రస్తుతం ఎంత ఆదాయం వస్తోంది.. ఏ మార్గాల్లో ఎక్కువ వస్తోందని సీఎం కేసీఆర్​ అడిగి తెలుసుకున్నారు. కార్గో ద్వారా ఆదాయం ఎలా ఉంది అని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మరోవైపు ఆర్టీసీకి బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు, ఇతర నిధులు రూ.1,500 కోట్లను సీఎం కేసీఆర్‌ కేటాయించారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ తెలిపారు. బడ్జెట్‌ నిధులు నెలానెలా విడుదలవుతున్నాయన్న మంత్రి.. బడ్జెటేతర నిధుల కింద ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల పూచీకత్తు ఇవ్వడంతో బ్యాంకు రుణం మంజూరు చేసిందని చెప్పారు. అందులో రూ.500 కోట్లు వచ్చాయని వెల్లడించారు. ఆర్టీసీ ఆదాయం పెంచే మార్గాలు, అప్పులపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement