Thursday, May 2, 2024

Greetings: ముస్లింల‌కు సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్ష‌లు

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. తెలంగాణకు ప్రత్యేకమైన “గంగజమునా తెహజీబ్ ” మరింతగా పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజ‌ల‌ జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాల‌ని సీఎం అభిల‌షించారు.

అదేవిధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు కూడా ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ మాసం ప్రారంభం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement