Saturday, May 4, 2024

Big Fight: వ‌డ్లు కొనేదాక వ‌ద‌లం, ఢిల్లీకి చేరిన‌ సీఎం కేసీఆర్‌.. కేంద్రంపై ప్రెష‌ర్ పెంచే యోచ‌న‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనేదాక వదలిదేలేదని, ఎక్కడిదాకైనా వెళ్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ కేంద్రంతో సంప్రదింపులు, ఒత్తిడి పెంచే లక్ష్యంతో ఢిల్లికి బయల్దేరి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి సీఎం కేసీఆర్‌తోపాటు, ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత తదితరులు ఢిల్లికి వెళ్లారు. మూడు నాలుగు రోజులపాటు ఆయన ఢిల్లిdలోనే ఉండనున్నారని ప్రబుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్‌ ప్రధానితో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ దంత వైద్యంతోపాటు, శోభమ్మ కూడా ఆరోగ్యపరమైన చికిత్సలు ఈ పర్యనటలో తీసుకోనున్నారు. కాగా నేటినుంచి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరుబాట పట్టనుంది. మరోవైపు ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌ ఢిల్లిd టూర్‌ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది.

ఇంకా తేలని కొనుగోళ్ల అంశం… పీఎం అపాయింట్‌మెంట్‌ కోరిన సీఎంఓ వర్గాలు
కాగా ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఇప్పటికే పార్లమెంట్‌లో ప్రకటన చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తన అభ్యంతరాలను కేంద్రానికి పలు రూపాల్లో వివరిస్తూనే వస్తున్నది. అయినప్పటికీ ఈ అంశంపై ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ధాన్యం కొనుగోళ్ల విషయంతోపాటు, ఉక్రెయిన్‌ యుద్ధంతో స్వదేశానికి వైద్య విద్యను మధ్యలో వదిలేసి వచ్చిన విద్యార్ధులను ఆదుకునే అంశంపై కూడా ప్రధానికి లేఖ రాశారు. ఈ రెండు అంశాలపై కేంద్రంకాని, ప్రకధాని కానీ ఇంకా ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఈ నేపథ్యంలో నేరుగా ప్రధానితోనే సమావేశమై అన్ని అనుమానాలను నృవత్తి చేసుకోవాలని, ప్రధానంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రధానివద్దే పట్టుపట్టి సాధించుకోవాలని సీఎం కేసీఆర్‌ బావనగా ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ప్రధాని కార్యాలయానికి అపాయింట్‌మెంట్‌ కోరుతూ విజ్ఞప్తి కూడా చేసినట్లు తెలిసింది.

నేటినుంచి ఐదంచెల ఉద్యమం…
కాగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో పోరుకు కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదెంచల్లో ఉద్యమ తీరును పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇదే విషయంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఢిల్లి వేదికగా నిరసన తెలపాలని ముందే నిర్ణయించారు. ఈ కోవలోనే ఆయన ఢిల్లికి చేరుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెల 4న మండల కేంద్రాల్లో, 6న జాతీయ రహదారుల దిగ్భంధం, 7న గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు, ప్రతి రైతు ఇంటిపై నల్ల .ఎండాల ఎగురవేత, మున్సిపాలిటీలలో బైక్‌ ర్యాలీలు, 11న ఛలో ఢిల్లిd కార్యక్రమం నిర్వహించాలని ఇప్పటికే ప్రణాళిక ఖరారు చేసి ప్రకటించారు. 11న ఛలో ఢిల్లిd కార్యక్రమంతో ఢిల్లిd వేదికగా పెద్ద ఎత్తున నిరసన దీక్షకు చేపట్టనున్నారు. ఈ దీక్షలో సీఎం కేసీఆర్‌ స్వయంగా పాల్గొననున్నారు. ఈలోగా ప్రధాని మోడీ, కేంద్రమంత్రులను కలిసి ధాన్యం కొనుగోళ్ల అస్పష్టతపై చివరి ప్రయత్నం చేయనున్నారు.

ఈనెల7న ఛలో ఢిల్లి విజయవంతానికి పలువురితో వరుస భేటీలు…
సోమవారంనుంచి వరుసగా ఆయన పలువురితో భేటీ కానున్నారు. నాన్‌ బీజేపి పార్టీల నేతలతోపాటు, 11న చేపట్టనున్న నిరసనకు మద్దతు సేకరించేందుకు ఢిల్లి వేదికగా ఆయన పలువురితో సమావేశం కానున్నారు. పలు రాష్ట్రాకలు చెందిన రైతు నేతలను, రైతు సంఘాలను, రాకేష్‌ టికాయత్‌ వంటివారితోపాటు మరికొందరితో చర్చలు జరపనున్నారని సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు, డీసీసీబిలు, డీసిఎంఎస్‌ పాలక మండళ్లు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఏకగ్రీవ తీర్మానాలు చేఇ ప్రధాని మోడీకి పంపాయి. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు కేంద్రంపై ఒత్తిడి తీవ్రం చేయాలన్న ఉద్యమ కార్యాచరణ నేటినుంచి ప్రారంభం కానున్నది. ఈ దిశలో ఆయన ఢిల్లిdనుంచే పార్టీ నేతలకు ఈ ఆందోళనా కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

అందరూ భాగస్వామ్యమయ్యేలా ప్రణాళిక…
ఇప్పటికే పార్టీ సమావేశంలో భాగంగా సీఎం కేసీఆర్‌ పార్టీ శ్రేణులను, రైతులను ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని, ప్రతీ ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన తరహాలోనే కేంద్రంలోని బీజేపి ప్రభుత్వంపై, ప్రధాని మోడీ వివక్షపై పోరు అంతే తీవ్రంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రధాని మోడీ తెలంగాణపై వివక్ష చూపుతున్నారని, పంజాబ్‌ రాష్ట్రంలో ముౄెఓత్తం ధాన్యం కొంటున్న కేంద్రం, తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ఇదే తీరును ఎందుకు కొనసాగించడంలేదని ఢిల్లిd వేదికగా ప్రశ్నించనున్నారు.

- Advertisement -

ఈ పర్యటన తర్వాత ఆయన మూడు నాలుగు రోజుల్లో హైదరాబాద్‌ చేరుకుని తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 7న జరపతలపెట్టిన ఛలో ఢిల్లిd కార్యక్రమంలో రైతులు, పార్టీ నేతలు పాల్గొనేలా ప్రత్యేక రైలులో తరలించే చర్యలతోపాటు, పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ దొరికిన పక్షంలో ధాన్యం కొనుగోళ్ల అంశం అమితుమీ తేల్చుకోవడంతోపాటు, ఇతర అంశాలను ప్రస్తావించనున్నారు. ఒకవేళ ప్రధాని మోడీతో సమావేశం కుదరని పక్షంలో ఈ మూడు నాలుగు రోజుల సమయాన్ని ఇతర పార్టీల నేతలు, రైతుల సంఘాల నేతలతో సమావేశం దిశగా సద్వినియోగం చేసుకొని, ఈనెల 7న జరగనున్న నిరసనకు మద్దతు కూడగట్టుకోవాలనే యోచనతో సీఎం కేసీఆర్‌ ఉన్నారు.
ప్రధాని భేటీలో స్పష్టత తర్వాతే తదుపరి ప్రత్యామ్నాయాలు…
ఢిల్లిలో కేంద్ర ప్రభుత్వంనుంచి వచ్చే స్పందనను బట్టి తదుపరి ఉద్యమ కార్యాచరణ కొనసాగించాలని భావిస్తున్న ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల అంశంలో ప్రత్యామ్నాయ పద్దతులను కూడా పరిశీలిస్తోంది. ఒకవేళ కేంద్రం ధాన్యం కొనుగోళ్లకు నిరాకరించినట్లయితే అనుసరించాల్సిన మార్గాలను కూడా సిద్దం చేసుకుంటోంది. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, కొనుగోళ్లకు, ధాన్యం నిల్వలకు కావాల్సిన పద్ధతులు, సౌకర్యాలు, గిడ్డంగుల వంటి సమాచారం రెడీ చేసి పెట్టుకున్నది. మిల్లర్లతో కూడా చర్చలు జరపాలని భావిస్తోంది. ధాన్యం

ప్రభుత్వమే కొనుగోలు చేసే బదులుగా మిల్లర్లతో కొనిపించే విధంగా పలు రకాల ప్రత్యామ్నాలను పరిశీలిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాలుకు కనీస మద్ధతు ధర రూ. 1980గా, సాధారణ రకానికి రూ. 1960గా ఉంది. అయితే మిల్లర్లు ఈ ధరకు కొనుగోలు చేసేందుకు సుముఖంగా లేమని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇబ్బంది లేని రీతిలో ఈ సీజన్‌లో సమస్యను పరిష్కరించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనేదాక వదలిదేలేదని, ఎక్కడిదాకైనా వెళ్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ తాజా ఢిల్లి పర్యటనతో ఈ ప్రకటనను కార్యరూపంలోకి తేనున్నారు. తెలంగాణ రైతాంగానికి ఇది జీవన్మరణ సమస్యగా పేర్కొంటున్న సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పంజాబ్‌ తరహాలో తెలంగాణలో కూడా 100శాతం ధాన్యాన్ని ఎఫ్‌్‌సీఐ సేకరించాలనే డిమాండ్‌తో ఆయన హస్తిన బాట పట్టారు. ఆయన పర్యటన కొనసాగుతుండగానే రాష్ట్రంలో మరోవైపు బహుముఖ పోరుకు పార్టీ శ్రేణులు సిద్దమయ్యాయి.

ఇతర సమస్యలపై కూడా…
అదేవిధంగా ఈ పర్యటనలో రిజర్వేషన్ల అంశాన్ని కూడా సీఎం కేసీఆర్‌ ప్రస్తావించనున్నారని సమాచారం. ప్రధానితో భేటీలో భాగంగా రిజర్వేషన్లు 50శాతం కంటే ఎక్కువ ఉండొద్దని రాజ్యాంగంలో లేదన్న అంశాన్ని లేవనెత్తడంతోపాటు ప్రత్యేక పరిస్థితుల్లో 50శాతం మించొచ్చన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆయన వివరించి, రాష్ట్ర శాసనసభ చేసిన ఏకగ్రీవ తీర్మానంపై తన డిమాండ్‌ను వినిపించనున్నారని తెలిసింది. ఎస్సీ వర్గీకరణ, బీసీల కులగణన వంటి సమస్యలను ఏకరువు పెట్టనున్నారని సమాచారం.

ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్​ ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనను ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ రిసీవ్ చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement