Saturday, May 4, 2024

దళిత బంధు ఆగే ప్రసక్తే లేదు: సీఎం కేసీఆర్

తెలంగాణలో దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆరునూరైనా 100 శాతం దళిత బంధు పథకాన్ని అమలుచేసి తీరుతమని తెలిపారు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు అని చెప్పారు. మహాయజ్ఞంలా దళితబంధును చేపట్టినట్లు సీఎం తెలిపారు. దళితుల అభివృద్ధికి లక్ష కోట్లైనా ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. కరోనా వల్ల దళిత బంధు ఏడాది ఆలస్యమైందన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతు బీమా తరహాలోనే చేనేత కార్మికులకు సహాయం అందిస్తామన్నారు. గీత కార్మికుల కోసం చెట్ల పన్నులు తొలగించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement