Friday, April 26, 2024

సోడా శ్రీదేవి…బస్ స్టాప్ హీరోయినా !!

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు సుధీర్ బాబు. ఆఖరుగా సుధీర్ బాబు న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చేస్తున్నాడు సుధీర్ బాబు. పలాస సినిమాతో దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆనంది నటిస్తోంది. ఆనంది గతంలో ఈరోజుల్లో, బస్టాప్ చిత్రాల్లో నటించింది.

అయితే తాజాగా విడుదల చేసిన వీడియోలో లైటింగ్ సూరిబాబు.. శ్రీదేవికి సైట్ కొట్టడాన్ని చూపించారు. సుధీర్ బాబు సోడా తాగుతుంటే గొంతులో గోలి దిగుద్ది జాగ్రత్త… ఆ తర్వాత నీలాగే ఒకడు సోడా సోడా అని తిరిగితే సోడా తీసి వాడి నెత్తిమీద కొట్ట.. అప్పటి నుంచి అందరూ నన్ను సోడా శ్రీదేవి అంటున్నారు అంటూ సుదీర్ బాబు కు వార్నింగ్ ఇస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement