Wednesday, May 15, 2024

సీఎం జ‌గ‌న్ తో భేటీ అయిన మంత్రి ‘పేర్నినాని’ – సినిమా టికెట్ల రేట్ల‌పై చ‌ర్చ‌

సీఎం జ‌గ‌న్ తో స‌మావేశ‌మ‌య్యారు రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ శాఖ‌ మంత్రి పేర్నినాని. సినిమా టికెట్ల అంశం, క‌మిటీ రిపోర్టుపై చ‌ర్చ‌లు జ‌రిగాయి. కాగా ఇప్ప‌టికే క‌మిటీ రిపోర్టు సిద్ధ‌మ‌యింది. ఈ నెల 10న సీఎం జ‌గ‌న్ తో సినిమా పెద్ద‌లు భేటీ కానున్నారు. సినిమా టికెట్ల ధరలపై నెలకొన్న వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తాజాగా మంత్రి పేర్ని నాని సీఎం జగన్ తో సమావేశమయ్యారు. టికెట్ల ధరలు, సినిమా థియేటర్ల యజమానుల సమస్యలు, ఇటీవల టికెట్ల ధరలపై ప్రభుత్వ కమిటీ అధ్యయనం తదితర అంశాలపై ఆయన సీఎంతో చర్చించనున్నారు. కాగా, ఈ నెల 10న చిరంజీవి, ఇతర సినీ పెద్దల బృందం సీఎం జగన్ ను కలవనున్నారు. ఈ నేపథ్యంలో, సీఎంతో పేర్ని నాని సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement