Wednesday, May 1, 2024

క‌ర్నూలులో ప‌ర్య‌టించ‌నున్న సీఎం జ‌గ‌న్ – వివ‌రాలు ఇవే

ఈ నెల 16న క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు సీఎం జ‌గ‌న్. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బావ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు. కృష్ణా నగర్ లోని ఎమ్మెల్యే శ్రీదేవి నివాసంలో నూతన వధూవరులను జ‌గ‌న్ ఆశీర్వదించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ పి. కోటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 16న సీఎం జ‌గ‌న్ క‌ర్నూలు షెడ్యూల్ .. ఉదయం 10.40: కడప నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు వెళతారు. ఉదయం 10.50: అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కర్నూలు ఏపీ ఎస్పీ బెటాలియన్ కు చేరుకుంటారు. ఉదయం 11.10: ఎమ్మెల్యే శ్రీదేవి ఇంటికి రోడ్డు మార్గంలో బయల్దేరుతారు.
ఉదయం 11.20: ఎమ్మెల్యే ఇంట్లో జరిగే పెళ్లి వేడుకలో పాల్గొంటారు. 11.35 వరకు అక్కడే ఉంటారు. ఉదయం 11.45: ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి హెలికాప్టర్లో ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు తిరుగు పయనం. మధ్యాహ్నం 12.05: ఓర్వకల్లు నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటార‌ని వెల్ల‌డించారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement