Monday, April 29, 2024

తుడా బోర్డు చైర్మ‌న్ గా చెవిరెడ్డి – మంత్రి ప‌ద‌వి పాయే

వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి జ‌గ‌న్ కోసం ఏం చేయ‌డానికైనా వెనుక‌డుగు వేయ‌ని నేత‌గా పేరుంది చెవిరెడ్డికి ..జ‌గ‌న్ ని సీఎంను చేసుకునేందుకు పాదయాత్ర చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత కూడా.. ఏ పదవినీ ఆశించకుండా… పనిచేస్తున్నారు. సీఎం జగన్ నివాసంలో పెద్ద పాలకుడిగా.. చెవిరెడ్డి వ్యవహరిస్తున్నారని… ఆయన అనుచరులే అంటూవుంటారు. అయితే.. ఎంతైనా.. సీనియర్ నాయకుడు.. మంచి వాయిస్ ఉన్ననాయకుడు.. పైగా లా చదవిన నేత..కావడంతో.. తాజాగా ఆయన అనుచరులు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల మంత్రి వర్గం రాజీనామా చేసిన తర్వాత.. చంద్రగిరిలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. చెవిరెడ్డి అన్న కాబోయే మంత్రి` అని రాత్రికి రాత్రి ఫ్లెక్సీలు దర్శన మిచ్చాయి. అయితే.. విషయం తెలి సిన చెవిరెడ్డి వెంటనే వాటిని దగ్గరుండి మరీ తీసేయించారని సమాచారం.

ఈ నేపథ్యంలో జగన్ …చెవిరెడ్డి కోరకుండానే.. మరోసారి.. టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు.. మంత్రి వర్గం కంటే ముందుగానే.. తుడా(తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) బోర్డు చైర్మన్ గా మరో రెండేళ్లపాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఈ ప‌రిణామాల‌తో ఆయ‌న అనుచరులు పెదవి విరుస్తున్నారు ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చినన వారికి పదవులు ఇస్తూ.. అంకిత భావంతో పనిచేస్తున్న వారిని అణగదొక్కుతున్నారని అంటున్నారు.. కానీ చెవిరెడ్డి మాత్రం జగన్ ఏ పనిచేయమంటే అదే చేస్తానని.. అంతకు మించి తనకు తెలిసింది ఏమీ లేదని కుండబద్దలు కొట్టారు. ఇది ఒక విధంగా మంచిదే అయినా… ఆయనను నమ్ముకున్న అనుచరులు మాత్రం అసంతృప్తితో ఉన్నారు. మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశించిన వారి ఆశ‌లు అడియాశ‌లే అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement