Wednesday, May 8, 2024

ఐఫోన్ కెమెరాలను పంపిణీ చేస్తోన్న సోనీ.. వెల్లడించిన సీఈవో టిమ్ కుక్

ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు యాపిల్ సీఈఓ టిమ్ కుక్. ఐఫోన్ కెమెరాల‌ను యాపిల్ త‌యారుచేయ‌ద‌ని, సోనీ నుంచి సెన్సర్ల‌ను పొందుతుంద‌ని మ‌న‌లో చాలామందికి తెలియ‌దు. అండ్రాయిడ్ ఫోన్ త‌యారీదారుల‌కు సోనీ కెమెరాల‌ను స‌ర‌రా చేస్తుంది. ఐఫోన్ల‌కు సోనీ కెమెరాల‌ను త‌యారుచేస్తుంద‌ని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తొలిసారి వెల్ల‌డించారు. టిమ్ కుక్ ప్ర‌స్తుతం జ‌పాన్‌లో స‌ర‌ఫ‌రాదారుల టూర్‌లో బిజీగా ఉన్నారు. ఐఫోన్ కోసం అత్యున్న‌త ప్ర‌పంచ‌శ్రేణి కెమెరా సెన్స‌ర్ల కోసం తాము ద‌శాబ్ధ‌కాలంగా సోనీతో చేతులు క‌లిపామ‌ని కుక్ ట్వీట్ చేశారు.

కుక్ ఇటీవ‌ల కుమ‌మొటో లోని సోనీ ఫెసిలిటీని సంద‌ర్శించారు. ఐఫోన్ మోడ‌ల్స్‌లో వాడే హార్డ్‌వేర్ గురించి యాపిల్ ఎన్న‌డూ పెద్ద‌గా వివ‌రాలు వెల్ల‌డించ‌ని క్ర‌మంలో ఐఫోన్‌లో వాడే సెన్స‌ర్ల‌కు సంబంధించి కుక్ ట్వీట్ ప్రాధాన్య‌త సంతరించుకుంది. యాపిల్ కెమెరాల కోసం సోనీ హార్డ్‌వేర్ వాడుతుంద‌ని గ‌తంలో వార్త‌లు రాగా తొలిసారిగా కంపెనీ ఈ స‌మాచారాన్ని నిర్ధారించ‌డం గ‌మ‌నార్హం. త‌మ భాగ‌స్వామ్యం నిరంత‌రం కొన‌సాగుతుంద‌ని సోనీ ఫెసిలిటీని సంద‌ర్శించిన క్ర‌మంలో కుక్ పేర్కొన‌డంతో రాబోయే ఐఫోన్ మోడ‌ల్స్ కూడా సోనీ కెమెరా సెన్స‌ర్ల‌తో క‌స్ట‌మ‌ర్ల ముందుకు రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement