Wednesday, May 15, 2024

పీ ఎస్ యూ లపై కేంద్రం సవతి ప్రేమ !!

ప్రభుత్వరంగ సంస్థ (పీఎస్ యూ)లను ప్రైవేటీకరణ వైపు మరల్చడానికి ఉసిగొల్పిన పరిస్థితులపై సరైన అధ్య
యనం చేయకుండా వాటిని ఏకంగా ప్రైవేటు పరం చేయడం ఒక్కటే మార్గంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలు భారత దేశ భవిష్యత్తును ప్రశ్నార్ధకంచేస్తున్నాయి.
రాబోయే కాలంలో భారతీయులు ఎదుర్కొనబోయే సామాజిక అసమానతలను, అశాంతినీ గుర్తించకుండ తీసుకొంటున్న సరళీకరణ నిర్ణయాలు సంక్షేమ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి. 20 సంవత్సరాలుగా ప్రపంచీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీ కరిస్తూ దేశ ప్రజల ఆకాంక్షలకు , సమాఖ్య స్ఫూర్తికి ప్రభుత్వమే సమాధి కట్టడం అత్యంత విషాదకర పరిణామం. జాతీయోద్యమ స్ఫూర్తితో భారతీయ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం చేయడానికి ప్రజల పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమం
లో భారత దేశంలో దాదాపు 500 వందల వరకు ప్రభుత్వరంగ సంస్థలు వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన ప్రతి సంస్థ ప్రత్యేకతలు విశిష్టమైన నాణ్యత ప్రమాణాలు కలిగి దేశంలోనే అత్యున్నతమైన నిర్వహణ కలిగిన HAL, BDL, BHEL, BEL, NMDC లాంటి సంస్థలు అనేకం ఏర్పాటు చేయడం జరిగింది.

1991 తరువాత భారత దేశం తీసుకొచ్చిన నూతనపారిశ్రామిక విధానంతో గతంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో మౌలిక వసతుల కల్పనలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చు కోవడంలో అశ్రద్ధ, నిర్లక్ష్య ధోరణి అవినీతితో కూడిన నిర్వహణ వల్ల వ్యవస్థలు కుంటుపడ్డాయి,
NDA హయాంలో నేరుగా పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది.
2014 వరకు అద్భుతంగా పనిచేసినా 300 వందల పైచిలు కు ప్రభుత్వ రంగ సంస్థలు తరువాత కాలంలో అధ్వాన్న
స్థితికి చేరడం చేరాయి. కానీ 2014 నుంచి 2019 మధ్య కాలంలో భారతీయులలో కుబేరుల సంఖ్య పెరిగిపోతుంది.. కానీ భారతీయ సంస్థలు మాత్రం నానాటికీ దివాలాతీస్తున్నాయి.

దేశీయ ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎలకు5జీ ఇవ్వడం కుదరదని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి చెప్పడం ప్రభుత్వ రంగ సంస్థల పట్ల కేంద్రప్రభుత్వం ఎంత అశ్రద్ధ వహిస్తుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. బీహెర్చ్ ఎల్, బీఈఎల్ లాంటి దిగ్గజ సంస్థలు వుండగా ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ రంగ పరికరాలు దేశ అవసరాల కోసం చైనా నుంచి దిగుమతి చేసుకొని ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వానికి సప్లయ్ చేయడం ప్రభుత్వ రంగ సంస్థల మీద సర్కార్ నిర్లక్ష్య ధోరణి పరాకాష్ట . బీహెచ్ఈఎల్ లాంటిదిగ్గజ సంస్థకు గత ఆరు సంవత్సరాల కాలంలో ఒక్క ఆర్డర్ రాలేదు ..నిన్న మొన్న పుట్టిన ఎంఈఐఎల్ లాంటి సంస్థ కి ఏకంగా రక్షణ రంగ పరికరాల తయారీ ఆర్డర్ దొరకడం విస్మయం కలిగిస్తున్నది. హెచ్ఎఎలకు తేలికపాటి విమానాలు, హెలికాప్టర్లు తయారు చేసే సామర్థ్యం ఉన్నది. 2014 వరకు సంస్థ ఇరవై వేల కోట్ల టర్నోవర్ తో నడుస్తున్న సంస్థ 2019 నాటికి 1000 కోట్ల అప్పుల్లో కి వెళ్ళడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాలకి అధికధరలు చెల్లించి విమానాలు హెలికాప్టర్లు కొనుగొలు ఆర్డర్ ఇస్తారు కానీ దేశీయ సంస్థ హెచ్ఎఎలను అభివృద్ధి చేసే అంశంపైనా, దాని సామర్ధ్యం పెంచే విషయంపైన ఏ మాత్రం శ్రద్ధచుపక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం కాకమరేమిటి. చేజేతులా… ప్రభుత్వ రంగంలోని రక్షణ సంస్థలను బలహీనం చేసి పాలకులది కాక మరేవరది? అద్బుతమైన లాభాలను అందిస్తున్న ఐఓసీఎల్, హెచ్ పీసీ ల్లాంటి సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, విమానాశ్రయాల రంగంలో వాటాల విక్రయం , ప్రభుత్వ రంగ సంస్థల పట్లవారికున్న అద్దకు, ఏవగింపునకు నిదర్శనం. ఈ మధ్య లో నీతి ఆయోగ్ 15 ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి ప్రతిపాదనలను సిద్ధం చేయడం, 27 జాతీయ బ్యాంకులను 12 బ్యాంకులుగా చేయడం, ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్ బ్యాంకులకు అనుమతి ఇవ్వడం, జాతీయబ్యాంకులలోని మొత్తం మొండి బకాయిలు ప్రైవేట్ సంస్థలవే కావడం,, ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా బకాయిలుఎగోటిన దాఖలాలే లేకపోవడం గమనార్హం.

ఈ రకమైన చర్యలు భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. గాలి నీరునేల ఖనిజ సంపద అడవులు వన్యప్రాణులు అన్ని ప్రైవేట్ పరం కానున్న ఈ సందర్భంలో ప్రజాస్వామ్య జాతీయ వాదులు ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, శ్రామికవర్గాల సుస్థిర అభివృద్ధికి కృషిచేయాలి. ప్రభుత్వ రంగమే ప్రజల చోదక శక్తి కావాలి.వాటి ఫలాలుదేశం దేశ ప్రజలు అనుభవించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement