Tuesday, May 7, 2024

భ‌ద్రాదిలో శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌లు – స్వామి వారికి విశేష పూజ‌లు

శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌లు భ‌ద్రాదిలో ప్రారంభ‌మ‌య్యాయి. పాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని మూలమూర్తులు, ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని చిత్రకూట మండపంలో వైష్ణవ సాంప్రదాయం ప్రకారం స్థానాచార్యులు స్థల సాయి నేతృత్వంలో రోలు, రోకలికి దేవతలను ఆవాహన చేసి, పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. అలా తయారు చేసిన పసుపుతో తలంబ్రాలను సిద్ధం చేశారు. ఏప్రిల్ 9న సీతారాములుకు ఎదుర్కోలు ఉత్సవం, 10న కల్యాణోత్సవం, 11న పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement