Sunday, May 5, 2024

కోవిడ్ ను లైట్ గా తీసుకోవద్దు : రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్

కరోనా విషయంలో సూచ‌న‌లు పాటించాల‌ని కేంద్రం రాష్ట్రాల‌కు తెలిపింది. రాష్ట్రాలను అలెర్ట్ చేస్తూ కేంద్ర వైద్యారోగ్యశాఖ లేఖలు రాసింది. కోవిడ్ ను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని సూచించింది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్ ప్రొటోకాల్ ను కచ్చితంగా పాటించాలని తెలిపింది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా చేపట్టాలని, అర్హులైన ప్రతి ఏజ్ గ్రూప్ వారికీ అవగాహన కల్పిస్తూ కరోనా టీకా అందించాలని సూచించింది. మాస్క్ ధరించడం, శానిటైజర్ వినయోగంలోనూ నిర్లక్ష్య ధోరణి రాకుండా చూడాలని చెప్పింది. అలాగే పక్కాగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్త్, చీఫ్ సెక్రటరీలకు లేఖలు పంపింది. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ ఈ లేఖలు రాసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement