Saturday, April 27, 2024

ఈ ఏడాది నుంచి ఏడో తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్

ఏపీలోని పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు సీబీఎస్ఈ విద్యాబోధన అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నుంచే తొలి అడుగు వేయాలని సీఎం జగన్ తలపెట్టారు. తొలుత 7వ తరగతిలో సీబీఎస్ఈ విద్యావిధానం అమలు చేయనున్నారు. ఆపై దశల వారీగా సెంట్రల్ సిలబస్ ను మిగతా తరగతులకు కూడా వర్తింపజేయనున్నారు.

ఈ మేరకు సీబీఎస్ఈ బోర్డుతో రాష్ట్ర విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏపీలో విద్యాప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా విద్యారంగంలో సంస్కరణలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, 2024-25 విద్యాసంవత్సరం నాటికి పదో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ విద్యాబోధన అమల్లోకి తీసుకురావాలన్నది ఏపీ ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement