Saturday, April 20, 2024

కుక్కను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా?

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను రాష్ట్రాలు కఠినంగా అమలు చేస్తున్నాయి. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మనుషులనే కాదు జంతువులను కూడా స్టేషన్ లో పెట్టారు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్ ​లో జరిగింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన ఓ శునకాన్ని అరెస్ట్ చేశారు పోలీసులు.

మధ్యప్రదేశ్ లో కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్రంలో కఠిన లాక్​ డౌన్​ అమల్లో ఉంది. అయితే, ఇండోర్‌ లోని పలాసియా ప్రాంతంలో ఓ వ్యాపారవేత్త తన కుక్కను తీసుకోని రోడ్డుపైకి వచ్చారు. కర్ఫ్యూ సమయంలో బయటకు రావడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు ఉన్న కుక్కను కూడా స్టేషన్ కి తరలించారు. ఆ తర్వాత జైలుకు పంపారు. కుక్క అరెస్టుపై జంతు ప్రేమికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement