Monday, May 6, 2024

కేర్ ఆసుప‌త్రిలో – న‌టుడు బాల‌కృష్ణకి మైన‌ర్ స‌ర్జ‌రీ

హీరో నంద‌మూరి బాల‌కృష్ణ భుజానికి ఆప‌రేష‌న్ చేశారు వైద్యులు. ‘అఖండ’ సినిమా షూటింగ్ సందర్భంగా ఆయనకు చిన్న ప్రమాదం జరిగింది. దీంతో హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో ఆయన భుజానికి ఆపరేషన్ నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయనకు మరో శస్త్ర చికిత్సను డాక్టర్లు నిర్వహించారు. కొంత కాలంగా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన మోకాలికి డాక్టర్లు మైనర్ సర్జరీ నిర్వహించారు. బాలయ్యకు జరిగింది చిన్న ఆపరేషనే అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు వెల్లడించారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. మరోవైపు ఆసుపత్రిలో డాక్టర్లతో పాటు బాలయ్య దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఆయన నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement