Sunday, April 28, 2024

కారుకింద ప‌డిన బైక‌ర్ – కాపాడిన పోలీసులు

ఓ కారుకింద ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ బైక‌ర్ ప‌డ్డాడు. దాంతో ఆ కారుని అమాంతం పైకి లేపారు పోలీసులు. ఈ ఘ‌ట‌న యూఎస్ లో చోటు చేసుకుంది. కాగా ఆ బైక‌ర్ ప్రాణాలు కాపాడారు పోలీసులు. యూఎస్ఏలోని సౌత్ కరోలినాలో ఇద్దరు ద్విచ‌క్ర‌వాహ‌నం వెళ్తుండ‌గా, వెనుక‌నుంచి కారు ఢీకొట్టింది. బైక్ డ్రైవ్ చేస్తున్న వ్య‌క్తి ఎగిరి కొంత‌దూరంలో ప‌డ‌గా, వెనుకున్న వ్య‌క్తి కారుకింద చిక్కుకుపోయాడు. అక్క‌డే స్థానికులు పెద్ద‌సంఖ్య‌లో గుమిగూడారు. పోలీసులు ప‌రుగున‌వ‌చ్చి స్థానికుల స‌హాయంతో కారును సినిమాటిక్ స్టైల్‌లో పైకి లేపారు. ఆ వ్య‌క్తిని ప్రాణాల‌తో కాపాడారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా, 16గంట‌ల్లోనే మిలియ‌న్ మంది వీక్షించారు.ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement