Wednesday, May 1, 2024

అజ్ఞాతంలో కెన‌డా ప్ర‌ధాని కుటుంబం..

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆయన కుటుంబంతో కలిసి ఓ రహస్య ప్రాంతానికి వెళ్లారు. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన ఆంక్షలు, నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆందోళనలు హింసాత్మకంగా మారే అవకాశం ఉన్నందున ఆయన్ని రహస్య ప్రాంతానికి తరలించాలని భద్రతా వర్గాలు నిర్ణయించాయి. కరోనా కట్టడిలో భాగంగా ట్రూడో ప్రభుత్వం వ్యాక్సిన్లను తప్పనిసరి చేసింది.మాస్కులు ధరించడం, సామాజిక దూరం సహా ఇతర నిబంధనల్ని
కఠినతరం చేసింది. ముఖ్యంగా వ్యాక్సిన్లు తీసుకోని ట్రక్కు డ్రైవర్లను దేశంలోకి అనుమతించేది లేదని ప్రకటించడం ఆందోళనలకు దారితీసింది. తొలి నుంచి వ్యాక్సిన్లను వ్యతిరేకిస్తున్న ఓ వర్గం దీనిపై గళమెత్తింది. పైగా అమెరికా నుంచి వచ్చే ట్రక్కు డ్రైవర్లను నాలుగు రోజులపాటు క్వారంటైన్‌కు పంపాలన్న నిబంధన మరింత ఆగ్రహానికి గురిచేసింది.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ర్యాలీగా రాజధాని ఒట్టావాకు బయలుదేరారు. దీంతో రాజధానికి దారితీసే రహదారులన్నీ ట్రక్కు కాన్వాయ్‌ లతో కిక్కిరిసి పోయాయి. ‘ఫ్రీడం కాన్వాయ్‌’ పేరిట తరలివస్తున్న ఈ ట్రక్కులన్నీ ఒట్టావాలోకి ప్రవేశిస్తే హింస చెలరేగే అవకాశం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికలతో ముందు జాగ్రత్తగా ప్రధానిని రహస్య ప్రాంతానికి తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement