Friday, May 10, 2024

బుల్లెట్ సాంగ్ కి -125మిలియ‌న్ల వ్యూస్

ఎన‌ర్జిటిక్ హీరో రామ్..హీరోయిన్ కృతిశెట్టి జంట‌గా న‌టిస్తున్న చిత్రం ది వారియ‌ర్. ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన బుల్లెట్ సాంగ్ 125 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ది వారియర్ చిత్రంలో రామ్ పోతినేని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. తమిళ మాస్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 22న ది వారియర్ నుంచి వచ్చిన ‘ది బుల్లెట్’ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ ను దక్కించుకుంటోందని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు మాస్ సాంగ్ తెలుగు, తమిళంలో కలిసి 125 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. ఇంకా ట్రెండింగ్ లోనే ఉండి రికార్డు క్రియేట్ చేస్తోంది. ఈ సాంగ్ కు దేవీ శ్రీ ప్రసాద్ క్యాచీ టూన్ అందించగా.. తమిళ యాక్టర్ శింబు , హరిప్రియ అద్భుతంగా పాడారు. శ్రీ మణి ఈ సాంగ్ కు అదిరిపోయే లిరిక్స్ అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement