Sunday, April 28, 2024

జగన్ పై కుట్రలు చేసిన వారు కష్టాలు పడుతున్నారు.. నారాయణస్వామి

తిరుపతి సిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కుట్రలు చేసిన వారు కష్టాలు అనుభవిస్తున్నారని రాష్ట్ర డిప్యూటీ సీఎం కళత్తూర్ నారాయణస్వామి అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ… సోనియా గాంధీతో కలిసి చంద్రబాబు కుట్ర చేసి వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించడం జరిగిందని గుర్తు చేశారు. తొడలు కొట్టే కార్యక్రమానికి నారా లోకేష్ సహా తెలుగుదేశం నాయకులు స్వస్తి పలకాలని కోరారు. గడపగడపకు వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథంతో స్వాగతం పలుకుతున్నారన్నారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టడం జరిగిందని తెలిపారు. టీటీడీ ఉద్యోగులు తిరుమల స్థానికుల బాగోగుల కోసం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కృషి చాలా అభినందనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టిటిడి ఉద్యోగస్తులు అండగా ఉండి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ… సమిష్టిగా పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు అందరూ నడుం బిగించాల్సిన అవసరముందన్నారు. తిరుపతి ప్రజల అభ్యున్నతి కోసం రాజీలేని పోరాటం చేసిన ఘనత కరుణాకర్ రెడ్డిదేనన్నారు. ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు అందిస్తుందన్నారు. దివంగత నేత వైఎస్సార్ ఆశయ సాధన కోసం జగనన్న అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. భావితరాలకు జగనన్న ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ… జగనన్న ప్రభుత్వం విద్యా వైద్యం పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. జిల్లా పరిశీలకులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న ఆలోచనలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… రానున్న తిరుపతి కోపరేట్ బ్యాంకు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. లక్షా నలభై వేల కోట్ల రూపాయలు 2.20 కోట్ల మంది ప్రజలకు అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 175 స్థానాలు దక్కించుకోవడమే ఏకైక అజెండా కావాలని శ్రేణులకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. భూమన అభినయ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్లీనరీ సమావేశంలో కేడర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement