Friday, April 26, 2024

‘ది వారియ‌ర్’ నుంచి ‘బుల్లెట్’ సాంగ్‌ విడుదల

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం  ‘ది వారియ‌ర్’. ‘ఇస్మార్ట్ శంక‌ర్’ సినిమా తర్వాత రామ్ తన కొత్త లూక్స్ ని ట్రై చేస్తున్నాయి. తాజా మూవీలోని గతానికి భిన్నంగా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ఎన్.లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం ‘ది వారియ‌ర్’ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. తాజాగా ఈ మూవీలోని ‘బుల్లెట్’ లిరిక‌ల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. శ్రీ మ‌ణి సాహిత్యం అందించిన ఈ పాట‌ను త‌మిళ స్టార్ శింబు పాడాడు. ఈ పాటలో హీరో రామ్ డ్యాన్సులు ఇరగదీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement