Friday, May 3, 2024

రూటు మార్చిన సుయేల్ బ్రేవర్మన్..నా తల్లిదండ్రుల మూలాలు భారత్ లో ఉన్నాయ్..

తన తల్లి మూలాలు మద్రాస్ లో ఉన్నాయని భారత్ ను కించపర్చేలా మాట్లాడిన బ్రిటన్ హోం శాఖ మంత్రి సుయేల్ బ్రేవర్మన్ అన్నారు. యూకేలో ‘ఇండియా గ్లోబల్‌ ఫోరం’ నిర్వహించిన దీపావళి కార్యక్రమంలో భారతీయ సంప్రదాయ కట్టుబొట్టుతో హాజరవ్వడమే కాకుండా.. భారత్‌ నా హృదయంలో ఉంది.. నా ఆత్మలో ఉంది.. నా రక్తంలో ఉంది. నా తండ్రి మూలాలు అక్కడే ఉన్న గోవాలో ఉన్నాయి. నా తల్లి  మూలాలు మద్రాస్‌లో ఉన్నాయి అని ఆమె వ్యాఖ్యానించారు.భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకొనేందుకు బ్రిటన్‌ ఆతృతతో ఉందని బ్రేవర్మన్ అన్నారు. తాను హోంశాఖ  మంత్రిగా.. రెండు దేశాల మధ్య భద్రతా పరమైన సహకారానికి విలువ ఇస్తానని తెలిపారు. ఇరు దేశాల్లో దేశీయంగా ఇది కీలకమైన అంశం. అంతేకాదు.. అంతర్జాతీయంగా ఇండో-పసిఫిక్‌లో చాలా ముఖ్యమైందని వెల్లడించారు. బ్రెగ్జిట్‌ అంటే వీసాలు, వాణిజ్యం విషయంలో యూరోసెంట్రిక్‌ ఆలోచనా విధానంలో ఉండటం కాదని పేర్కొన్నారు. తాను బ్రిటీష్‌ ఇండియన్‌ వర్గానికి చెందినందుకు గర్వపడుతున్నానని చెప్పారు.భారతీయుసంతతి వారు బ్రిటన్‌కు చేసిన కృషిని బ్రేవర్మన్ కొనియాడారు. బ్రిటన్‌ గ్రామాలు, పట్టణాలు, నగరాలు భారతీయుల వలసలతో సుసంపన్నమయ్యాయని పొగడ్తలతో ముంచెత్తారు.  ఆర్థికంగా ఇరుదేశాలు కలిసి పనిచేయాల్సిన అవశ్యకత ఉండటంతో.. వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఆతృతతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement