Saturday, April 20, 2024

Tirumala: అక్టోబర్​ 24, 25, నవంబరు 8వ తేదీల్లో.. శ్రీవారి బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

తిరుమల (ప్రభన్యూస్): తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్ ద‌ర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్ 24న దీపావళి ఆస్థానం కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 23న సిఫార్సు లేఖలు స్వీకరించబోమని దేవస్థానం అధికారులు తెలిపారు. అక్టోబ‌రు 25న మంగ‌ళ‌వారం సూర్యగ్రహణం రోజున ఉద‌యం 8 నుంచి రాత్రి 7.30 గంట‌ల‌ వరకు దాదాపు 12 గంటలపాటు శ్రీ‌వారి ఆల‌యం తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 24న సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ అధికారులు తెలిపారు.

ఇక.. న‌వంబ‌రు 8న చంద్ర‌గ్రహణం రోజున ఉద‌యం 8.30 నుండి రాత్రి 7.30 గంట‌ల‌ వరకు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం రద్దు చేసినందున నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని టీటీడీ తెలిపింది. అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబ‌రు 8న చంద్ర‌గ్రహణం రోజుల్లో శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లను కూడా రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులు తమ యాత్రను ప్లాన్​ చేసుకోవాలని కోరారు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement