Friday, April 26, 2024

బుల్లెట్ పై పెళ్ళిమండ‌పానికి వ‌చ్చిన పెళ్లికూతురు

పెళ్ళి కూతురు అంటే సిగ్గు ప‌డుతూ, మెలిక‌లు ప‌డుతూ త‌లఎత్త‌కుండా ఉండే రోజులు పోయాయ్. ఇప్పుడు ఏకంగా బుల్లెట్ బండెక్కి వ‌చ్చేసే రోజులు వ‌చ్చాయి. వివ‌రాల్లోకి వెళ్తే.. పెళ్లి మండపానికి కొత్తగా ఎంట్రీ ఇచ్చింది. ఇంటి నుంచి ఫంక్షన్ హాల్ వరకు తానే స్వయంగా బుల్లెట్ బండి నడుపుతూ డుగ్గు.. డుగ్గు.. బండిపై వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. పెళ్లిలో వధువు ప్రత్యేకంగా నిలిచింది. ఎరుపు రంగు లెహంగాతో అలంకరించబడిన వధువును వీడియో వైర‌ల్ అవుతోంది. అదే సమయంలో రోడ్డుపై బుల్లెట్ పై డుగ్గు.. డుగ్గు బండిపై తెగ జోష్ లో కనిపిస్తుంది. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘witty_wedding’ అనే ఖాతాలో షేర్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement