Thursday, April 25, 2024

డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలు రిమాండ్ కు తరలింపు : రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలను పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఏడు మంది వ్యాపారులని కోర్టులో పోలీసులు హాజ‌రు ప‌రుచ‌గా.. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించ‌డంతో, వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ అరెస్ట్ సమయంలో పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు. టోని 60 మంది యువకులతో కలిసి డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారని పోలీస్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పోలీసులకు చిక్కకుండా టోని హైద్రాబాద్ కు డ్రగ్స్ ను తరలించేవాడన్నారు. హైద‌రాబాద్ లోని ఓయో హోటల్ రూమ్ ను అద్దెకు తీసుకొని డ్రగ్స్ ను సరఫరా చేసేవాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వ్యాపారులకు గ్రాము కొకైన్ ను రూ.20 వేలకు టోని విక్రయించేవాడని, గత నాలుగేళ్లుగా టోని వద్ద వ్యాపారులు డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

టోని ద్వారా వ్యాపారవేత్తలు నిరంజన్ కుమార్ జైన్, శాషవత్ జైన్, యోగనాంద్ అగర్వాల్, దండు సూర్యసుమంత్ రెడ్డి, బండి భార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినేని సాగర్, అల్గాని శ్రీకాంత్, సుబ్బారావులను డ్రగ్స్ కొనుగోలు చేసేవారని పోలీసులు గుర్తించారు. టోని సహా వీరిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు వ్యాపారుల పేర్లను కూడా త్వరలోనే వెల్లడిస్తామని సీపీ చెప్పారు. బెంగుళూరు, ముంబైలలో డ్రగ్స్ సరఫరాకు ప్రత్యేక గ్యాంగ్ లు ఏర్పాటు చేసుకొని టోని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సీవీ ఆనంద్ తెలిపారు. తాత్కాలికమైన వీసా, పాస్‌పోర్టుతో టోని ఇండియాకు వచ్చి డ్రగ్స్ దందా నడుపుతున్నాడని సీవీ ఆనంద్ చెప్పారు. టోనీ వీసా, పాస్‌పోర్ట్ గడువు తీరిన తర్వాత కూడా రహస్యంగా ముంబైలో తలదాచుకొంటున్నట్టుగా తెలిపారు. హైదరాబాద్ నగరంలో సుమారు 300 మంది డ్రగ్స్ ఉపయోగిస్తున్నారని తమ వద్ద సమాచారం ఉందని సీవీ ఆనంద్ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement