Wednesday, May 15, 2024

Breaking: 8న త‌మిళ‌నాడు అసెంబ్లీ అత్య‌వ‌స‌ర స‌మావేశం

తమిళనాడు రాష్ట్ర‌ ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో అఖిల‌ప‌క్ష స‌మావేశం ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశానికి బీజేపీ, అన్నా డీఎంకే పార్టీల నేత‌లు గైర్హాజ‌ర‌య్యారు. ఈ అఖిల‌ప‌క్ష స‌మావేశంలో ప్రధానంగా నీట్ పరీక్షపై తమిళనాడు అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని గవర్నర్ తిరస్కరించడం, బడ్జెట్ లో తమిళనాడుకు జరిగిన అన్యాయంపై స్టాలిన్ అఖిలపక్ష సమావేశంలో చర్చించారు. మ‌ళ్లీ నీట్ కు వ్య‌తిరేకంగా తీర్మానం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ త‌మ బాధ్య‌త‌ల‌ను విస్మ‌రించార‌ని సీఎం స్టాలిన్ అన్నారు. నీట్ కు వ్య‌తిరేకంగా తీర్మానం చేసేందుకు ఈనెల 8వ తేదీన అత్య‌వ‌స‌ర అసెంబ్లీ స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement