Tuesday, April 30, 2024

Breaking : ల్యాండింగ్ త‌ర్వాత ప్ర‌మాదానికి గురైన విమానం – వీడియో చూస్తే షాకే

ల్యాండింగ్ త‌ర్వాత ప్ర‌మాదానికి గుర‌యింది విమానం. ఈ వీడియో చూస్తే షాక‌వ్వాల్సిందే. కాన్పూర్‌లోని చకేరీ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి కాన్పూర్‌కు చేరుకున్న కోస్ట్‌గార్డ్‌కు చెందిన డోర్నియర్ విమానం ల్యాండింగ్ తర్వాత ప్రమాదానికి గురైంది. విమానం ల్యాండింగ్ సమయంలో, దాని ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడిందని, దీని కారణంగా, విమానం ల్యాండింగ్ తర్వాత కూడా ఆగలేదని , రన్‌వే నుండి బయటకు వెళ్ళిన‌ట్టు వీడియోలో చూస్తే తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వ‌చ్చింది. విమానం ల్యాండింగ్ తర్వాత ఎడమ ఇంజిన్ పనిచేయడం ఆగిపోయిందని, దీని కారణంగా పైలట్లు విమానాన్ని ల్యాండ్ చేసిన వెంటనే, అది కుడి వైపుకు వెళ్లి ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత విమానం పెద్దగా దెబ్బతినలేదట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement