Friday, May 3, 2024

‘రామ్ రాజ్ కాట‌న్’ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స్టార్ హీరో య‌శ్

క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ ..కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దాంతో కేజీఎఫ్2 కూడా తెర‌కెక్కుతోంది. స్టార్ హీరోగా య‌శ్ మారాక ఆయ‌న‌కి ప‌లు ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ఇలాంటి తరుణంలో కేజీఎఫ్‌ హీరో యష్‌ కు అదిరి పోయే ఆఫర్‌ వచ్చింది. రామ్‌ రాజ్‌ కాటన్‌ కంపెనీకి బ్రాండ్‌ అంబాడిసర్‌ గా ఆ కంపెనీ హీరో యశ్‌ ను నియామకం చేసింది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన చేసింది రామ్‌ రాజ్‌ కాటన్‌ కంపెనీ. దేశ వ్యాప్తంగా రామ్‌ రాజ్‌ కాటన్‌ కంపెనీకి ఎంత క్రేజ్‌ ఉందో మనకు తెలిసిందే. ఆ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గించుకోకుండా.. స్టార్‌ హీరో యష్‌ ను బ్రాండ్‌ అంబాసిడర్‌ గా నియమించుకుంది రామ్‌ రాజ్‌ కాటన్‌ కంపెనీ. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement