Monday, July 15, 2024

సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి జగన్ : రామ్ గోపాల్ వర్మ ట్వీట్

రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్.. సీఎం జగన్‌ను కలవడంపై వర్మ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా సమస్యలపై చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్‌తో పాటు పలువురు దర్శకులు వెళ్లి సీఎం జగన్‌తో చర్చించారు. ఈ సమావేశంపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్‌, దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, కొరటాల శివ వెళ్లడంపై ట్విట్టర్‌లో ట్వీట్ ద్వారా స్పందించారు.

“సూపర్, మెగా, బాహుబలి లెవెల్ బెగ్గింగ్ వల్ల ఈ మీటింగ్ జరిగినప్పటికీ, ఒమేగా స్టార్‌ని వైఎస్ జగన్ ఆశీర్వదించినందుకు నేను సంతోషిస్తున్నాను. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి జగన్‌ని నేను అభినందిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement