Saturday, May 18, 2024

Breaking : బీసీలంటే బ్యాక్ బోన్ – జ‌గ‌న‌న్న చేదోడు కింద 2.85ల‌క్ష‌ల మందికి న‌గ‌దు జ‌మ

ఫీజు రియంబ‌ర్స్ మెంట్ ను గ‌తంలో నీరు గార్చార‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో సామాజిక న్యాయం జ‌ర‌గ‌లేద‌న్నారు. బీసీలంటే కేవ‌లం ప‌నిమొట్లు కాద‌న్నారు. బీసీలంటే స‌మాజానికి బ్యాక్ బోన్ లాంటివాళ్ల‌న్నారు సీఎం. పాద‌యాత్ర‌లో వీరి క‌ష్టాల‌ను ద‌గ్గ‌ర‌గా చూశాన‌న్నారు. లంచాలు,వివ‌క్ష‌కు తావులేకుండా పార‌ద‌ర్శ‌కంగా అమ‌లు చేస్తామ‌న్నారు. ల‌బ్ధిదారుల జాబితాను గ్రామ స‌చివాల‌యాల్లో ఉంచామ‌న్నారు సీఎం జ‌గ‌న్. రెండేళ్ల‌లో రూ.583కోట్లు ఇచ్చామ‌న్నారు. ఈ ద‌ఫాలో ల‌క్షా 46వేల మంది టైల‌ర్ల‌కు రూ.146కోట్లు, 98వేల మంది ర‌జ‌కుల‌కు రూ.98కోట్లు,40వేల మంది నాయీ బ్రాహ్మ‌ణుల‌కు రూ.40కోట్లు , షాపులున్న ప్ర‌తి ఒక్క‌రికి ఏటా రూ.ప‌ది వేల సాయం, జ‌గ‌న‌న్న చేదోడు కింద 2.85ల‌క్ష‌ల మందికి న‌గ‌దు జ‌మ చేస్తామ‌న్నారు. ర‌జ‌కులు, నాయీ బ్రాహ్మ‌ణులు, ద‌ర్జీల‌కు రూ.10వేలు అంద‌జేస్తామ‌న్నారు జ‌గ‌న్. ర‌జ‌కులు,నాయీ బ్రాహ్మ‌ణులు, ద‌ర్జీల శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం లేద‌న్నారు. మొత్తం రూ.285కోట్లు జ‌మ‌చేసింది ఏపీ స‌ర్కార్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement