Friday, May 17, 2024

Breaking : ముదురుతోన్న హిజాబ్ వివాదం – క‌ర్నాట‌క‌లో మూడురోజుల‌పాటు స్కూల్స్, కాలేజ్ ల‌కు సెల‌వు

క‌ర్నాట‌క ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హిజాబ్ వివాదంపై స్పందించారు క‌ర్నాట‌క సీఎం. హిజాబ్ అంశం హైకోర్టు ప‌రిధిలో ఉందన్నారు. హైకోర్టు తీర్పు వెలువ‌రించేవ‌ర‌కు సంయ‌మ‌నం పాటించాల‌న్నారు. ఎవ‌రూ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయొద్ద‌న్నారు.ఎవ‌రూ ఎలాంటి ఆందోళ‌న‌లు చేయొద్ద‌ని సీఎం బ‌స్వ‌రాజ్ బొమ్మై తెలిపారు. క‌ర్నాట‌క‌లో హిజాబ్ వివాదం ముదురుతోంది. దాంతో క‌ర్నాట‌క‌లో మూడు రోజుల‌పాటు విద్యాసంస్థ‌లు మూసివేస్తున్న‌ట్లు సీఎం బ‌స్వ‌రాజ్ బొమ్మె తెలిపారు. స్కూళ్లు, కాలేజ్ ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. బాగ‌ల్ కోట్ లో ఉద్రిక్త‌త నెల‌కొంది. పీయూ కాలేజ్ ద‌గ్గ‌ర విద్యార్థులు ఆందోళ‌న‌కి దిగారు. విద్యార్థుల‌పై లాఠీచార్జ్, బాష్ప‌వాయువుని ప్ర‌యోగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement