Wednesday, May 1, 2024

Breaking : అమెరికా వైస్ ప్రెసిడెంట్ – క‌మ‌లా హ్యారీస్ కి క‌రోనా

అమెరికా వైస్ ప్రెసిడెంట్ క‌మ‌లా హ్యారీస్ కి క‌రోనా సోకింది. ఈ నేపథ్యంలో కరోనా తన ఉనికిని మళ్లీ చాటుకుంటోందని వైట్ హౌస్ ప్రకటించింది. ప్రెసిడెంట్ జో బిడెన్ కానీ, ప్రథమ మహిళ జిల్ బిడెన్ కానీ ఇటీవలి కాలంలో కమలా హారిస్‌ను కలవడం కానీ, ఆమెతో సన్నిహితంగా మెలగడం కానీ జరగలేదని వైట్ హౌస్ తెలిపింది. వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కు మొదటి ర్యాపిడ్ టెస్ట్ చేస్తే అందులో పాజిటివ్ వచ్చింది. ఆ తరువాత చేసిన పిసిఆర్ పరీక్షలలో కూడా హారిస్ పాజిటివ్ అని తేలిందని వైట్ హౌస్ తెలిపింది. అయితే ఆమెలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదు అని వైట్ హౌస్ ప్రకటించింది. పాజిటివ్ నిర్థారణ కావడంతో హారిస్ తన నివాసంలో ఒంటరిగా ఐసోలేట్ అయ్యారు. ఇంట్లో నుంచే రిమోట్‌ పద్ధతిలో పని చేస్తారని, కరోనా వైరస్ కోసం నెగెటివ్ వచ్చిన తర్వాత మాత్రమే వైట్ హౌస్‌కి తిరిగి వస్తారని తెలిపారు. హారిస్, 57, మోడర్నా కోవిడ్-19 వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నారు. మొదటి డోస్‌ను పదవీ బాధ్యతలు స్వీకరించడానికి కొద్ది వారాల ముందు, రెండవ డోస్ 2021లో ప్రారంభోత్సవ దినం తర్వాత తీసుకున్నారు. ఆమె అక్టోబర్ చివరలో బూస్టర్ షాట్, ఏప్రిల్ 1న ఎక్ స్ట్రా బూస్టర్‌ షాట్ కూడా తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement