Sunday, May 19, 2024

Breaking : అసోం సీఎంపై – హైద‌రాబాద్ లో కేసు న‌మోదు

హైద‌రాబాద్ లో అసోం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ‌ పై కేసు న‌మోద‌యింది. కాంగ్రెస్ నేత‌ల ఫిర్యాదుతో కేసు న‌మోదు చేశారు పోలీసులు. కాంగ్రెస్ కీల‌క నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఫిర్యాదు. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు సోమవారం నాడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి పిర్యాదు ఆధారంగా అసోం సీఎం పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసోం సీఎం ఈ నెల 11వ తేదీన రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2016లో పాకిస్లాన్ పై జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన ఆధారాలను బయట పెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.ఈ విషయమై హిమంత బిశ్వశర్మ స్నందించారు. రాహుల్ గాంధీ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ తనయుడే అని చెప్పడానికి ఆధారాలు అడగలేదు కదా అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేగాయి. ఈ వ్యాఖ్యలను పలువురు ఖండించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement