Saturday, May 4, 2024

బ్ర‌హ్మాస్త్ర రిలీజ్ డేట్ : శివుడిగా ర‌ణ్ బీర్ క‌పూర్

ప్ర‌స్తుతం పాన్ ఇండియా చిత్రాలు తెర‌కెక్కుతున్నాయి. వాటిల్లో బాలీవుడ్ చిత్రం బ్ర‌హ్మాస్త్ర కూడా ఒక‌ట‌నే చెప్పాలి. ఈ చిత్రం సోషియో ఫాంట‌సీ అడ్వెంచ‌ర్ మూవీ. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని మూడు భాగాలుగా విడుదల చేయనున్నారు. ”బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్: శివ” పేరుతో మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ భారీ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసిన మేకర్స్.. మోషన్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగార్జున ట్వీట్ చేస్తూ.. ”విశ్వంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం మేల్కొంటోంది.. ఒక కొత్త హీరో ఆవిర్భవించాడు! ప్రపంచమంతా ‘శివ’ని కలవండి!” అని పేర్కొన్నారు. రణబీర్ కపూర్ పోషించిన శివ పాత్రకి సంబంధించిన ఈ మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌ణ్ బీర్ క‌పూర్, ఆలియాభ‌ట్,మౌనీరాయ్, టాలీవుడ్ హీరో నాగార్జున ప్ర‌ధాన‌పాత్ర‌లు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని అయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9న (09.09.2022) గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ‘బ్రహ్మస్త్ర” చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటుగా తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ధర్మ ప్రొడక్షన్స్ – ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాబోయే రోజుల్లో సినిమాలోని మిగతా ప్రధాన పాత్రలకు సంబంధించిన లుక్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement