Saturday, May 4, 2024

పేలిన గ్యాస్ సిలిండ‌ర్ : ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు

గ్యాస్ సిలిండ‌ర్ పేలి ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న‌ హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ లో ఉన్న‌ బీకేగూడలో ఓ ఇంట్లో అర్ధరాత్రి వంట గ్యాస్ సిలిండ‌ర్ పేలింది. ముందుగా గ్యాస్ లీక్ ఆత‌ర్వాత పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి గోడ కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ‌గా, మరో యువకునికి మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను గాంధీ ఆస్ప‌త్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement