Monday, April 29, 2024

వ‌ర‌ల్డ్ రిచెస్ట్ యాక్ట‌ర్.. షారుక్ ఖాన్

ప‌ఠాన్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్. తాజాగా వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్ ప్రపంచంలో అత్యంత సంపన్నులైన నటుల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో షారుఖ్ నాలుగో స్థానంలో నిలిచి అరుదైన ఘనత సాధించారు. షారుఖ్‌ ఆస్తుల విలువ $770 మిలియన్‌లు. అంటే ఇండియన్‌ కరెన్సీలో రూ.6వేల కోట్లుకు పైమాటే. ఆస్తులు విలువలో షారుక్‌ పలువురు హాలీవుడ్‌ హీరోలను కూడా వెనక్కు నెట్టేశారు. టామ్‌క్రూయిజ్, జాకీచాన్‌ వంటి దిగ్గజ హాలీవుడ్‌ నటులను షారక్ వెనక్కు నెట్టి ముందు స్థానంలోకి వచ్చారు. ఇక ప్రముఖ హాలీవుడ్‌ కమెడియన్‌ జెర్రీ సైన్‌ఫీల్డ్‌ $1 (8 వేల కోట్లకు పైన)తో మొదటి స్థానంలో నిలిచాడు. ఇక ఈ లిస్ట్‌లో ఇండియా నుండి స్థానం సంపాదించుకున్న నటులలో షారుఖ్‌ఖాన్ మాత్రమే ఉండ‌టం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement