Friday, April 26, 2024

వివాదాస్ప‌ద ట్వీట్ పై.. బాలీవుడ్ న‌టుడు ర‌షీద్ ఖాన్ అరెస్ట్

2020లో చేసిన వివాదాస్పద ట్వీట్‌పై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్‌ నటుడు కమల్‌ రషీద్‌ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆయ‌న‌ను ముంబై మిమానాశ్రయంలో మలాడ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు బోరివలి కోర్టులో కమల్‌ ఖాన్‌ను హాజరు పరుచనున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. తనకు తాను సినీ విశ్లేషకుడినని చెప్పుకునే రషీద్‌ ఖాన్‌.. ప్రముఖ బాలీవుడ్‌ సల్మాన్‌ ఖాన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, ఆమిర్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌.. ఇలా అందరు హీరోల మీద కూడా ఎప్పుడూ విమర్శలు చేస్తుంటాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement