Wednesday, March 27, 2024

పాకిస్థాన్ లో భారీ వ‌ర్షాలు-వ‌ర‌ద‌ల‌తో 1,136మంది మృతి

ప‌లుచోట్ల వ‌ర్షాలు భీభ‌త్సం సృష్టిస్తున్నాయి.కాగా పాకిస్థాన్‌లో రుతుప‌వ‌నాల వ‌ల్ల ఆక‌స్మికంగా వ‌చ్చిన వ‌రద‌ల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 1136 మంది మ‌ర‌ణించారు. 33 మంది మిలియ‌న్ల జీవితాలు ఆగం అయ్యాయి. దేశంలోని 15 శాతం జ‌నాభా వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వ‌ర్షాల వ‌ల్ల ర‌హ‌దారులు, పంట‌లు, ఇండ్లు, బ్రిడ్జ్‌లు, ఇత‌ర మౌళిక స‌దుపాయాలు ధ్వంసం అయ్యాయి. రానున్న రోజుల్లో దేశంలో తీవ్ర ఆహార కొర‌త ఏర్ప‌డుతుంద‌ని మంత్రి ఇక్బాల్ తెలిపారు. 2010లో వ‌చ్చిన వ‌ర‌ద‌ల క‌న్నా ఇప్పుడు ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నారు. 2010లో వ‌ర‌ద‌ల వ‌ల్ల దేశంలో రెండు వేల మందికిపైగా మ‌ర‌ణించారు. దేశ‌వ్యాప్తంగా వ‌ర‌ద‌ల వ‌ల్ల సుమారు 10 బిలియ‌న్ల డాల‌ర్ల న‌ష్టం జ‌రిగి ఉంటుంద‌ని ఆ దేశ మంత్రి అహ‌సాన్ ఇక్బాల్‌ పేర్కొన్నారు. దేశంలోని మూడ‌వ వంతు భాగం నీటిలో మునిగిపోయిన‌ట్లు కూడా మ‌రో మంత్రి వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement