Wednesday, May 1, 2024

Breaking: భారతీయ కిసాన్​ యూనియన్​లో చీలిక.. రాకేశ్​ టికాయత్​కి వ్యతిరేకంగా మరో సంఘం

రెండేళ్ల క్రితం ప్రారంభమై.. దేశంలో రైతుల ఉద్యమానికి కీలకంగా మారిన భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఇప్పుడు రెండుగా చీలిపోయింది. టికాయత్ సోదరులకు వ్యతిరేకంగా ఒక వర్గం రైతులు తిరుగుబాటు చేశారు. – అధ్యక్షుడు నరేష్, అధికార ప్రతినిధి రాకేష్ ఆదివారం భారతీయ కిసాన్ యూనియన్ (అరాజ్‌నైటిక్) పేరుతో వారి సొంత అరాజకీయగ్రూపును ఏర్పాటు చేశారు. కాగా, ఈ కొత్త గ్రూపు అధ్యక్షుడిగా రాజేష్ సింగ్ చౌహాన్ ఎన్నికయ్యారు. రాజేంద్ర సింగ్ మాలిక్, అనిల్ తలాన్, హర్నామ్ సింగ్ వర్మ, బిందు కుమార్, కున్వర్ పర్మార్ సింగ్, నితిన్ సిరోహిలతో సహా ఇతర నాయకులు కొత్త గ్రూపులో చేరారు.ఇది రైతుల ప్రయోజనాల కోసం పని చేస్తుందని , రాజకీయాల్లోకి రాదని వారు హామీ పేర్కొనడం గమనార్హం.

ఇక.. BKU నాయకత్వంతో విడిపోయిన రైతు నాయకుల ప్రధాన సమస్య ఏమిటంటే అది చాలా రాజకీయంగా మారింది. ఈ పరిణామంపై రాకేష్ తికాయత్ స్పందిస్తూ.. బీకేయూపై నమ్మకం లేని వారు స్వేచ్ఛగా వెళ్లవచ్చని అన్నారు. గతంలో కూడా చాలా మంది తమ  సంస్థను వీడారని.. ఉత్తరప్రదేశ్‌లోనే 8-10 గ్రూపులు విడిపోయాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా సంస్థలో చీలికకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. దీని వెనుక ప్రభుత్వ హస్తం ఉందని, ఈరోజు కొంత మంది ప్రభుత్వం ముందు లొంగిపోయారని.. మళ్లీ సంస్థను బలోపేతం చేస్తామన్నారు.

విడిపోయిన గ్రూప్ నాయకుడు రాజేష్ చౌహాన్ మాట్లాడుతూ.. మేము రాజకీయ వ్యతిరేకులం. కానీ, రాకేష్ టికాయత్ ఒక నిర్దిష్ట పార్టీ కోసం ప్రచారం చేశాడు. 2022 ఎన్నికల సమయంలో మరొక పార్టీని లక్ష్యంగా చేసుకున్నాడు. ఇది మా సిద్ధాంతాలకు విరుద్ధం అని చెప్పుకొచ్చాడు. రైతుల ప్రయోజనాల కోసం ,  సంస్థను కాపాడటానికి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, రాకేష్, నరేష్ టికాయత్ తమతో రావాలనుకుంటే వారిని స్వాగతిస్తాం కానీ, వారు సంస్థ యొక్క సూత్రాలను పాటించాల్సి ఉంటుందని వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement