Tuesday, May 21, 2024

Self Declare | ఎంపీ నిధులతో ఇళ్లు కట్టిన, కొడుకు పెండ్లి చేసిన.. బీజేపీ ఎంపీ సోయం వీడియో హల్​చల్​

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఎంపీల్యాడ్స్‌ నిధుల్లో అవినీతికి పాల్పడ్డానని తనకు తానే సెల్ప్​ డిక్ట్లేర్​ చేశారు.​ ఓ మీటింగ్​లో అందరిముందు ప్రసంగిస్తూ.. తన అవినీతిని అంగీకరించిన వీడియో సోమవారం సోషల్‌మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ వీడియోలో ఎంపీ తన ఇంటిని నిర్మించడానికి, తన కొడుకు పెళ్లి చేయడానికి పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి (MPLAD) నిధులను ఉపయోగించినట్లు తెలిపాడు. ఇవన్నీ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో  స్పష్టంగా వినిపిస్తున్నాయి.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

“ఇల్లు లేకపోతే నాకు విలువ ఉండదు. ఇదంతా ఏ నాయకుడూ ఒప్పుకోడు. కానీ నేను చేస్తున్నాను.. (ప్రజల చప్పట్లు). నా కొడుక్కు పెళ్లి చేయాల్సిన అవసరం వచ్చింది. కనీస అవసరాలకు వాడుకున్నాను..కానీ మొన్నటి పనికిరాని ప్రజాప్రతినిధులలా మొత్తం నిధులను స్వాహా చేసినట్టు కాదు’’ అని బీజేపీ ఎంపీ సోయం బాపురావు అందరిముందూ చెబుతున్న ప్రసంగం వీడియో ఒకటి ఇప్పుడు సోషల్​ మీడియాలో హల్​ చల్​ చేస్తోంది. 

అయితే.. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో దాన్ని వ్యతిరేకించారు సోయం బాపురావు. తాను అవినీతికి పాల్పడ్డట్టు చెప్పిన వాదనను తిరస్కరించారు. BRS నాయకులు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన గురించి అంతా అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. సరైన వాస్తవాలు తెలియకుండా తనలాంటి ఆదివాసీ ఎంపీని రోడ్డుపైకి లాగడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

https://twitter.com/KP_Aashish/status/1670710328638988288
Advertisement

తాజా వార్తలు

Advertisement