Thursday, May 16, 2024

Shame | బీజేపీ ఎంపీ లైంగిక వేధింపులు.. మేమూ మీ బిడ్డలమే, నేతలకు రెజ్లర్ల లేఖలు

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బీజేపీ ఎంపీ బ్రిజ్​భూషణ్​ సింగ్​ని అరెస్టు చేయాలని మూడు వారాలుగా భారత రెజ్లర్లు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు సైతం ఆదేశాలు జారీ చేసినా ఢిల్లీ పోలీసులు ఇంకా అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ి బీజేపీ ఎంపీలు, మంత్రులు, మహిళా లీడర్లకు లేఖలు అందజేయనున్నట్టు రెజ్లర్లు చెప్పారు. అయితే.. ఇవ్వాల రెజ్లింగ్​ ఫెడరేషన్​ విషయంలో భారత ఒలింపిక్​ సంఘం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు వారాలుగా భారత అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన తెలుపుతూ ఆందోళన చేస్తున్నారు. బీజేపీ ఎంపీ, నిందితుడు బ్రిజ్​భూషణ్​ సింగ్​ని అరెస్టు చేయకపోవడాన్ని వారు నిరసిస్తూ పలు రకాల ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా, ఆదివారం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పరిపాలనను రద్దు చేసి, భారత ఒలింపిక్ సంఘం స్వాధీనం చేసుకుంది. ఇది తమకు న్యాయం చేయడానికి మొదటి అడుగు అని భారత రెజ్లర్లు అన్నారు. లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని క్రీడాకారులు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, భారతదేశపు అత్యుత్తమ రెజ్లర్‌లలో అనేక మంది నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఇక.. బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు  చేసినప్పటికీ ఇంకా అరెస్టు చేయలేదు. రెజ్లింగ్​ ఫెడరేషన్​కు చెందిన అన్ని అధికారిక పత్రాలను తాత్కాలిక కమిటీకి అందజేయాలని ఇండియన్​ ఒలింపిక్​ అసోసియేషన్​ WFI సెక్రటరీ జనరల్ VN ప్రసూద్‌ను కోరింది. అయితే.. ఈ విషయాన్ని ఫెడరేషన్ కూడా అంగీకరిస్తున్నట్టు తెలిపింది.

- Advertisement -

ఇది (ప్రస్తుత WFI రద్దు) న్యాయం కోసం తమ పోరాటంలో మొదటి అడుగు. తమ పోరాటం సరైన తీరులోనే సాగుతోంది. ఇది తమకు విజయం.. తమకు న్యాయం జరిగే దాకా పోరాటం మరింత ఉత్సాహంగా కొనసాగిస్తాం”అని టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ అన్నారు. సోమవారం నుంచి బీజేపీకి చెందిన మహిళా ఎంపీలందరికీ రెజ్లర్లకు మద్దతు తెలియజేయాలని లేఖలు రాస్తామని వినేశ్ పోగట్​ తెలిపారు.

అయితే.. ఇప్పటివరకు అధికార బీజేపీకి చెందిన ఏ నాయకుడు కూడా భారత రెజ్లర్లకు మద్దతుగా ముందుకు రాలేదు. దేశంలోని మహిళల భద్రత గురించి వారు మాట్లాడుతూ.. తాము కూడా వారి బిడ్డలమే.. బీజేపీలోని మహిళా లీడర్లు, కేంద్ర ప్రభుత్వంలోని మహిళా ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి తమకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. తాము వారికి (అధికార పార్టీ మహిళా పార్లమెంటేరియన్లు) బహిరంగ లేఖ రాస్తున్నాం. తమ తోటి రెజ్లర్లు ఆ లేఖలను చేతితో అందజేస్తారు. ఇ-మెయిల్ ద్వారా కూడా లేఖలు పంపిస్తాం. ఇన్ని రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నా.. తమ వాయిస్, తమ మనోవేదన ఇంకా వారికి చేరలేదని అనుకుంటున్నాం. ఈ లేఖలు అందుకున్న తర్వాత వారు వచ్చి మద్దతు ఇస్తారని భావిస్తున్నాం అని వినేష్ చెప్పారు.

ఈ కేసుకు సంబంధించి బ్రిజ్ భూషణ్, WFI సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌పై ఒక మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఛేదించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు రెండుసార్లు ప్రశ్నించారు. మైనర్ రెజ్లర్ యొక్క స్టేట్‌మెంట్ కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 ప్రకారం రికార్డ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement